చిరు చిన్న అల్లుడి మూవీ ఫస్ట్ లుక్ విడుదల

Sat,May 26, 2018 05:03 PM
vijetha first look  revealed

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీ విజేత ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగా ఫ్యాన్స్ తో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, కొద్ది సేపటి క్రితమే చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. స్టైలిష్ లుక్ లో కళ్యాణ్‌ దేవ్ కనిపిస్తుండగా, ఆయనకి రివర్స్ లో మురళీ శర్మ నిలుచొని ఉన్నారు. బిగ్ స్క్రీన్ పై చూడటానికి ముందుగా ఈ ఫస్ట్ లుక్ అంటూ కళ్యాణ్‌ దేవ్ తన సోషల్‌మీడియా పేజ్ ద్వారా పోస్టర్ షేర్ చేశాడు. ఇది మెగా ఫ్యాన్స్ ని ఎంతగానో అలరిస్తుంది. రాకేశ్ శ‌శి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతున్న విజేత జూలై లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

1985లో చిరంజీవి ప్రధాన పాత్రలో కోదండ‌రామి రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం విజేత. ఆ టైటిల్‌ నే చిరు తన అల్లుడి సినిమాకి పెట్టడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి సింగిల్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందని తెలుస్తుండ‌గా, ఇప్పటికే డ‌బ్బింగ్ కార్యక్రమాలు మొద‌ల‌య్యాయి. చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. ఇటీవ‌ల‌ కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చ‌ల్ చేసింది. ఎవడే సుబ్రహ్మణ్యం’- ‘కళ్యాణ వైభోగమే’ ఫేం మాళవికా నాయర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

"బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


5804
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles