సరికొత్త కథతో విజయ్‌దేవరకొండ కొత్త సినిమా..పోస్టర్

Thu,March 8, 2018 06:03 PM
Vijaydevarakonda New Movie NOTA First Look


హైదరాబాద్ : విజయ్‌దేవర కొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ యాక్టర్ ప్రస్తుతం ట్యాక్సీవాలా, ఏ మంత్రం వేసావే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు విడుదలవక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘నోటా’ మూవీ చేస్తున్నాడు ‘అర్జున్‌రెడ్డి’ యాక్టర్. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్‌ చేతి వేలుపై ఓటేసిన సిరా గుర్తుతో కనిపిస్తున్నాడు. కేఈ జ్ఞాన్‌వేల్ రాజా సమర్పణలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొదలైనట్లు పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్. ఈ సినిమాలో నటించే మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

2319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles