ఉత్తమ నటుడిగా విజయ్‌దేవరకొండ

Mon,December 9, 2019 03:57 PM

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రానికి బాక్సాపీస్ వద్ద మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో నటనపరంగా విజయ్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాకుగాను విజయ్‌దేవరకొండ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. బిహైండ్‌వుడ్స్ గోల్డ్ మెడల్స్-ఏడో వార్షికోత్సవంలో విజయ్ అవార్డు అందుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌కు కేజీఎఫ్ ఫేం యశ్ ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేశాడు. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో విజయ్, రష్మిక ర్యాంప్‌వాక్ చేసి సందడి చేశారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం చేస్తోన్న విషయం తెలిసిందే.4124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles