తిత్లీ బాధితులకు విజయ్‌దేవరకొండ సాయం

Mon,October 15, 2018 04:49 PM
Vijaydevarakonda Donates fund to ap cm relief fund

హైదరాబాద్: టాలీవుడ్ యాక్టర్ విజయ్‌దేవరకొండ సినిమాలతో బిజీగా ఉంటూ..మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటాడనే విషయం తెలిసిందే. కేరళ వరద బాధితులకు తనవంతు విరాళం అందించిన విజయ్‌దేవరకొండ..తాజాగా తిత్లీ తుఫాను బాధితులకు సాయాన్ని అందించాడు. తనవంతుగా ఏపీ సీఎం సహాయనిధికి విజయ్ రూ.5లక్షలు రూపాయలు అందించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తనను అభిమానించే వారు తమకు తోచినంతగా తిత్లీ బాధితులకు సాయం చేయాలని కోరాడు.

‘లేహ్ లో ఉన్న నాకు ఈ వార్త తెలిసింది. ఈ సారి సమస్య మనది. మీరు అందించే సాయం చాలాపెద్దది. కేరళ కోసం నాతో కలిసి విరాళాలు అందించారు. ఇపుడు మరోసారి ఆ పని చేయండి. నేను ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలబడుతా. తిత్లీ తుఫాను బాధితులకు సహాయం చేద్దామని’ అభిమానులను కోరాడు విజయ్. తిత్లీ తుఫాను కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సమాచారవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. రెండు వేలకుపైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తీర ప్రాంత గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
1529
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles