కోర్టు కేసులో విజయశాంతికి ఊరట

Thu,December 7, 2017 03:50 PM
కోర్టు కేసులో విజయశాంతికి ఊరట

చెన్నైలోని ఓ ల్యాండ్ విషయంలో కొద్ది రోజులుగా అనేక అభియోగాలు ఎదుర్కొంటుంది విజయశాంతి. ఒకే భూమిని విజయశాంతి ఇద్దరికి అమ్మే ప్రయత్నం చేసిందని ఇందర్ చంద్ జైన్ అనే వ్యక్తి చెన్నై జార్జ్ టౌన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. ఇరువురి పిటీషన్లను పరిశీలించిన కోర్టు, ఈ వ్యవహారంలో విజయశాంతికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వివరాలలోకి వెళితే చెన్నై టీ నగర్ లోని ఓ స్థలానికి పవర్ ఆఫ్ అటార్నీ గా ఉన్న విజయశాంతి తనకు దాన్ని అమ్మడానికి ఓ అగ్రిమెంట్ కుదుర్చుకుని రూ. 4.68 కోట్లు తీసుకున్నారని, కానీ ఆ తర్వాత ఇతరులకు దానిని విక్రయించారని పేర్కొన్నాడు. కనీసం నా దగ్గర తీసుకున్న మనీ కూడా తిరిగి ఇవ్వలేదని హోటల్ అధినేత అయిన జైన్ పిటీషన్ లో తెలిపాడు. ఐదేళ్ళ క్రితం జార్జి ఈ పిటీషన్ ని కోర్టులో వేయగా దీనికి తీర్పు బుధవారం వచ్చింది. వ్యక్తిగత కక్షలతో పిటిషన్లు వేయరాదని జైన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ..విజయశాంతిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది మద్రాస్ హైకోర్టు. దీంతో రాములమ్మకి కాస్త ఊరట లభించినట్టయింది. కొంత కాలం నుండి వెండితెరకు దూరంగా ఉంటున్న విజయశాంతి మెగాస్టార్ 151వ చిత్రం సైరాలో ముఖ్య పాత్ర పోషించనుందనే టాక్స్ వినిపిస్తున్నాయి.

1370

More News

VIRAL NEWS