ఫ్యాన్స్‌కి వార్నింగ్: నిన్న అజిత్‌, నేడు విజ‌య్‌

Thu,March 7, 2019 01:41 PM
vijay warns to his fans

ఒక్కోసారి అభిమానుల వికృత చేష్ట‌లతో సెల‌బ్రిటీలు చాలా ఇబ్బంది ప‌డుతుంటారు. అలాంటి చర్య‌లు చేయోద్ద‌ని వారించిన కూడా పెడిచెవిన పెడుతూ స్టార్స్ ఆందోళ‌న‌కి గుర‌య్యేలా చేస్తుంటారు . తాజాగా విజ‌య్ అభిమానులు కొంద‌రు బైక్‌పై ఆయ‌న కారుని ఫాలో అవుతూ ‘త‌ల‌ప‌తి త‌ల‌ప‌తి’ అంటూ కేకలు వేశారు. అంతేకాదు డ్రైవింగ్ చేస్తూనే వీడియో తీస్తుండ‌డంతో అభిమానుల‌ని హెచ్చ‌రించారు విజ‌య్. ద‌య చేసిన నన్ను ఫాలో కావొద్దు, క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని అన్నార‌ట‌. ప్ర‌స్తుతం విజ‌య్ చిత్ర షూటింగ్ చెన్నైలోని ఓ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో జ‌రుగుతుంది. షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళుతుండ‌గా, అభిమానులు ఆయ‌న‌ని ఫాలో అయ్యారు. గ‌తంలోను ఓ అభిమాని ఇలానే అజిత్ కారుని చేజ్ చేసి మ‌రీ సెల్ఫీ దిగాడు. ఆ స‌మ‌యంలో ఇంకోసారి ఇలాంటి ప‌నులు చేయోద్ద‌ని అజిత్ హెచ్చ‌రించారు. సూర్యకి కూడా ఇలాంటి అనుభవం గ‌తంలో ఎదురైంది. త‌ల‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. క్రీడా నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా న‌య‌న‌తార న‌టిస్తుంది.


2511
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles