వివాదంలో విజ‌య్ మూవీ ఫ‌స్ట్ లుక్

Fri,June 22, 2018 01:39 PM

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి చిత్రం మెర్స‌ల్ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో అదిరింది టైటిల్‌తో విడుద‌లైన ఈ చిత్రానికి ఇక్క‌డ ప్రేక్ష‌కుల నుండి కూడా భారీ ఆద‌ర‌ణ ల‌భించింది . అయితే ఇందులో జీఎస్టీకి సంబంధించిన డైలాగ్స్ తో పాటు దేవాలయాలు, వైద్యుల గురించి - కార్పొరేట్ హాస్పిటళ్ల గురించి విజయ్ పేల్చిన సెటైర్లు అనేక వివాదాలకి దారి తీశాయి. బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజా ఈ చిత్రానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర యూనిట్ కి కమల్ హాసన్, రజనీకాంత్, విశాల్ , విజయేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ మద్దతు తెలపగా, ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో వెంటనే స్పందించిన విజ‌య్ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు.


ప్ర‌స్తుతం విజ‌య్ త‌న 62వ సినిమాగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కార్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నేడు విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో విజ‌య్ సిగ‌రెట్ తాగుతున్న‌ట్టుగా ఉంది. ఫ‌స్ట్ లుక్ ఫ్యాన్స్‌లో ఆనందాన్ని రెట్టింపు చేసిన‌, కొంద‌రు మాత్రం దీనిపై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఎంపీ, మాజీ ఆరోగ్య‌శాఖామంత్రి అన్భుమ‌ని రామ‌దాస్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ‌య్ ఫ‌స్ట్‌లుక్‌పై విరుచుకు ప‌డ్డాడు. ఈ పోస్ట‌ర్ ద్వారా సిగ‌రెట్‌ని ప్ర‌మోట్ చేస్తున్నావా,ఇలా చేయ‌డం సిగ్గు చేటు అని ట్వీట్‌లో తెలిపారు . చేతిలో సిగ‌రెట్ లేక‌పోతే ఇంకా స్టైలిష్‌గా ఉంటావ‌ని అని అన్న ఆయ‌న పాత న్యూస్ పేప‌ర్ క్లిప్‌ని జ‌త‌చేసి మాజీ మినిస్ట‌ర్ అభ్య‌ర్ధ‌న ప్ర‌కారం సినిమాల‌లో సిగ‌రెట్ తాగ‌వ‌ని అన్నావు, మ‌రి ఇప్పుడు చేసిందేమిట‌ని ప్ర‌శ్నించారు. అయితే అభిమానులు మాత్రం పొలిటిక‌ల్ కుట్ర‌గా వ‌ర్ణిస్తున్నారు. గ‌తంలో విజ‌య్ చాలా సినిమాల‌లో సిగరెట్ తాగిన‌ప్ప‌టికి, అప్పుడు ఎవ‌రు అడ‌గలేదు కాని ఇప్పుడు ఎందుకు దీనిపై ర‌చ్చ చేస్తున్నారంటూ కొంద‌రు నెటిజ‌న్స్ ఫైర్ అవుతున్నారు. మ‌రి ఈ వివాదం ఇంకెంత ముందుకు వెళుతుందో చూడాలి.


1764
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles