మ‌రో బైలింగ్యువ‌ల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Wed,December 12, 2018 10:18 AM
Vijay Trying His Luck Again With Another Bilingual Movie

యూత్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కెరియ‌ర్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రంతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల గీతా గోవిందం, టాక్సీవాలా అనే చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. అయితే నోటా అనే చిత్రంతో త‌మిళ ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతో నిరాశ‌ప‌ర‌చాడు. దీంతో మ‌రో బైలింగ్యువ‌ల్ చిత్రం చేసి వారిని అల‌రించేందుకు సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం సూర్య ప్ర‌ధాన పాత్ర‌లో ఎన్‌జీకే అనే చిత్రాన్ని నిర్మిస్తున్న ఎస్ఆర్ ప్ర‌భు ప్రొడ‌క్ష‌న్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ బైలింగ్యువ‌ల్ చిత్రం ఉండ‌నుందని అంటున్నారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నార‌ట‌. శ్రీ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగ‌తి తెల‌సిందే.

2213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles