రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో పాట పాడిన స్టార్ హీరో

Tue,July 9, 2019 08:59 AM
vijay to sing Verithanam song for Bigil

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో బిగిల్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బిగిల్ అంటే తెలుగులో విజిల్ అని అర్దం. ఈ చిత్రంలో విజ‌య్ రెండు లుక్స్‌లో క‌నిపించ‌నున్నారు. అందులో ఒక‌టి గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర అయితే.. మ‌రొక‌టి ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ పాత్ర అని తెలుస్తుంది. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపావ‌ళికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో జాకీష్రాఫ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం వ‌హిస్తున్నాడు. ఆయ‌న సంగీత ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ తొలిసారి పాట పాడారు. గ‌తంలో విజ‌య్ ‘రసిగన్, వేలై, తుపాకీ, కత్తి, తేరి, భైరవ’ వంటి సినిమాల్లో ప‌లు పాట‌లు పాడారు. తొలి రెహ‌మాన్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో త‌న తాజా చిత్రం బిజిల్ కోసం ఓ పాట ఆల‌పించారు. ‘వెరితనం..’ అంటూ ఈ పాట సాగుతుంది. వెరితనం అంటే కసి, ఉన్మాదం వంటి అర్థాలున్నాయి. ఈ పాట సంగీత ప్రియుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని టీం చెబుతుంది.

2352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles