స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో తండ్రి, కొడుకులుగా న‌టిస్తున్న స్టార్ హీరో

Tue,June 4, 2019 10:19 AM
Vijay To Play Father And Son For his latest film

ఆట్లీ దర్శకత్వంలో కోలీవుడ్ యాక్టర్ విజయ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ - అట్లీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరీ, మెర్స‌ల్ చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో తాజా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీలో కథిర్, యోగిబాబు, రెబా మోనికా జాన్, వివేక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో విజయ్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో విజ‌య్ తండ్రిగా, కొడుకుగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. మ‌రి విజ‌య్ చేస్తున్న ఈ ప్ర‌యోగం ఎంత స‌క్సెస్ అందిస్తుందా అని అభిమానులు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. విజ‌య్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జూన్ 22న చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన కొత్త వివాదం వెలుగులోకి వ‌చ్చిన విష‌యం విదిత‌మే. త‌న క‌థ‌తోనే విజ‌య్ సినిమాని అట్లీ తెర‌కెక్కిస్తున్నాడ‌ని, నాకు తెలియ‌కుండా నా క‌థ‌తో సినిమా చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని వ‌ర్ధ‌మాన ద‌ర్శ‌కుడు శివ దక్షిణ భారత ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశాడు. నిర్మాత ద్వారానే త‌న క‌థ లీక్ అయి ఉంటుంద‌నే అనుమానం వ్య‌క్తం చేసాడు.

2559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles