వెండితెర ఆరంగేట్రం చేయ‌నున్న స్టార్ హీరో త‌న‌యుడు!

Thu,June 21, 2018 12:51 PM
vijay son enter into industry

నార్త్ క‌న్నా సౌత్ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ హీరోల వార‌సులు వెండితెర‌కి హీరోగా ప‌రిచ‌యం కావ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. నాటి ఎన్టీఆర్ కాలం నుండి నేటి మ‌హేష్ బాబు కాలం వ‌ర‌కు వారి త‌న‌యులు వెండితెర‌పై సంద‌డి చేస్తూనే ఉన్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం అన్ని భాష‌ల‌లోను స్టార్ హీరోల త‌నయులు హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. రీసెంట్‌గా విక్ర‌మ్ త‌న‌యుడు వెండితెర ఆరంగేట్రం చేశాడు. బాల ద‌ర్శ‌క‌త్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్నాడు. వ‌ర్మ అనే టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుంది.

త‌మిళంలో ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్. ఈయ‌నికి లెక్కకి మించిన అభిమానులు ఉన్నారు. విజ‌య్ సినిమా రిలీజ్ అవుతుందంటే అక్క‌డ పండుగ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటుంది. ప్ర‌స్తుతం ఏఆర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 62వ సినిమా చేస్తున్నాడు విజ‌య్. ఈ రోజు సాయంత్రం 6గం.ల‌కి మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. అయితే కోలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్న విజ‌య్ త‌న కుమారుడిని కూడా త్వ‌ర‌లో వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌ట‌. ఇటీవలే చెన్నైలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న సంజయ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు కెనడా వెళ్లనున్నాడట. కోర్స్ పూర్తైన త‌ర్వాత సంజ‌య్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏ రంగాన్ని ఎంచుకుంటాడా అని కోలీవుడ్‌లో భారీ చర్చ‌లు జ‌రుగుతున్నాయి.

3182
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles