విజ‌య్ సేతుప‌తి మంచి ప‌నికి హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న రైతులు

Fri,October 18, 2019 12:44 PM

మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోనే అని చెప్ప‌వ‌చ్చు. ప‌లు సంద‌ర్భాల‌లో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి అశేష ఆద‌ర‌ణ పొందారు. కేవ‌లం త‌మిళంలోనే కాదు తెలుగు, మ‌ల‌యాళంలోను విజ‌య్‌కి అభిమానులు ఉన్నారు. ప్ర‌స్తుతం ఎస్పీ జ‌గ‌న్నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లాభం అనే సినిమా చేస్తున్నాడు విజ‌య్ సేతుప‌తి. వ్య‌వ‌సాయం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాస‌న్‌, క‌లైయారాస‌న్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి రైతుల యూనియ‌న్ లీడ‌ర్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. కుంద్ర‌తూర్ ద‌గ్గ‌ర‌లోని పెరువయాల్ ప్రాంతంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, సినిమా కోసం రైతు సంఘ భ‌వ‌నం ఒక‌టి నిర్ణ‌యించాల‌ని మేక‌ర్స్ భావించారు. అయితే ఈ భ‌వ‌నాన్ని సెట్ మాదిరిగా కాకుండా రియ‌ల్ బిల్డింగ్‌లా రూపొందించాల‌ని నిర్మాత‌ల‌ని రిక్వెస్ట్ చేశార‌ట మ‌క్క‌ల్. అందుకు ఓకే చెప్పిన నిర్మాత‌లు బిల్డింగ్ రూపొందించి, షూటింగ్ పూర్తైన త‌ర్వాత బిల్డింగ్‌ని ఆ ఏరియా ప్రాంతానికి చెందిన రైతుల‌కి గిఫ్ట్‌గా అందించార‌ట‌. విజ‌య్ సేతుప‌తి నిర్ణ‌యంపై నెటిజ‌న్స్ తో పాటు రైతులు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

1490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles