హీరోయిన్ తండ్రి పాత్ర‌లో స్టార్ హీరో

Wed,June 12, 2019 11:16 AM

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్.. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఉప్పెన అనే చిత్రం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. జాలర్ల నేపథ్యంలో ఎమోషనల్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో హీరోయిన్ కృతి తండ్రి పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నాడ‌ని చెబుతున్నారు. తండ్రి పాత్రకి స్కోప్ ఎక్కువ ఉన్న నేప‌థ్యంలోనే విజ‌య్ ఈ పాత్ర‌కి అంగీకరించాడ‌ని అంటున్నారు. ఇదిలా ఉంటే విజ‌య్ సేతుప‌తి ప‌లు త‌మిళ చిత్రాల‌లో న‌టిస్తూనే చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న సైరా న‌ర‌సింహ‌రెడ్డి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం విజ‌య్ సేతుప‌తికి టాలీవుడ్ డెబ్యూ మూవీ కానుంది.

4266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles