సైరా సెట్లో సుదీప్, విజ‌య్ సేతుప‌తి

Thu,October 11, 2018 12:18 PM
vijay sethupathi, sudeep pic goes viral

భార‌త‌మాత‌కి బిగుసుకున్న సంకెళ్ళ‌ని తెంచ‌డానికి రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించిన వ్య‌క్తి ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది.. ఆసియా బోర్డర్ జార్జియాలో షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది. 40రోజుల పాటు ఈ దేశంలో జ‌ర‌గ‌నున్న‌ భారీ వార్ సీక్వెన్స్ ఎపిసోడ్‌లో 300 గుర్రాలు,150 మంది జూనియ‌ర్ ఆర్టిస్ట్స్‌తో పాటు కొంత మంది సీనియ‌ర్ స్టార్స్ పాల్గొంటున్న‌ట్టు స‌మాచారం.

50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కే ఈ ఫైట్ సీక్వెన్స్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆర్మీ.. బ్రిటిషర్స్‌తో యుద్ధానికి దిగుతుంది. హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ ఈ ఫైట్‌ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ఫైట్ కోసం స్లోవ‌కియా నుండి ప్ర‌త్యేకంగా 3డీ ఫ్లైయింగ్ కెమెరా తెప్పించిన‌ట్టు తెలుస్తుంది . మొత్తం 500కి పైగా స‌భ్యులు ఫైట్ స‌న్నివేశం కోసం పని చేయ‌నున్నార‌ట‌. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి, క‌న్నడ హీరో సుదీప్ కూడా షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. తాజాగా వారిరివురి లొకేష‌న్ ఫోటో ఒక‌టి విడుద‌లైంది. సుదీప్ అవుకు రాజు అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండగా, విజ‌య్ సేతుప‌తి త‌మిళ భాష‌ని తెలుగులోకి అనువ‌దించే వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

సైరా చిత్రం వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల కానుండ‌గా, ఇందులో చిరంజీవి స‌ర‌స‌న నయనతార, తమన్నా, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ హిస్టారికల్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ రోజు అమితాబ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. న‌ర‌సింహ‌రెడ్డి గురువు గోస‌యి వెంక‌న్న పాత్ర‌లో అమితాబ్ క‌నిపించ‌నున్నారు.

1853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles