ర‌జ‌నీకాంత్‌తో పోటీ ప‌డ‌నున్న స్టార్ హీరో

Thu,April 26, 2018 03:53 PM
vijay sethupathi plays villain role in rajani movie

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన కాలా, 2.0 చిత్రాలు విడుద‌ల కావ‌ల‌సి ఉండ‌గా ఆయ‌న 168వ చిత్రం మేలో సెట్స్‌పైకి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని జిగ‌ర్తాండ ఫేం కార్తీక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కించనున్నారు. ఈ మూవీలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించేందుకు ముగ్గురు హీరోయిన్స్‌ని పరిశీలిస్తున్నార‌ట‌. దీపికా ప‌దుకొణే, త్రిష‌, అంజ‌లి ప్ర‌స్తుతం రేసులో ఉన్నారు. వీరి ముగ్గురిలో ఓ భామని క‌థానాయిక‌గా ఫైనల్ చేసే చాన్స్ ఉంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి ర‌జ‌నీకాంత్ 45 రోజులు డేట్స్ కేటాయించాడ‌ట‌. కళానిధిమారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ మూవీని రూపొందించ‌నుంది.

చిక్కడు దొరకడు, పిజ్జా తోపాటు పలు హిట్ చిత్రాలను తెర‌కెక్కించిన‌ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించాలని భావిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్ర‌న్ చిత్రానికి సంగీతం అందించ‌నున్నాడు. అయితే త‌మిళ ప‌రిశ్ర‌మలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న విజ‌య్ సేతుప‌తి ఈ మూవీలో ప్రతినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ మ‌ధ్య విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్నాడు విజ‌య్ సేతుప‌తి. విక్ర‌మ్ వేద‌లో మాధ‌వ‌న్‌తో క‌లిసి న‌టించిన ‘మక్కల్‌ సెల్వన్‌’ విజ‌య్ సేతుప‌తి.. చిరంజీవి 151వ చిత్రం సైరాలోను ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సేతుపతి, కార్తిక్ సుబ్బరాజ్ ఇద్దరూ మంచి స్నేహితులు కాగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ‘పిజ్జా, ఇరైవి, బెంచ్ టాకీస్’ వంటి హిట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఈ ఫ్రెండ్షిప్‌తోనే కార్తీక్ చిత్రంలో విజయ్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించేందుకు ఒప్పుకున్న‌ట్టు తెలుస్తుంది.

2464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS