చిరు సినిమాలో తమిళ హీరో పాత్ర ఫుల్ పవర్ ఫుల్

Thu,August 24, 2017 12:30 PM
Vijay Sethupathi important role in sye raa

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా..నరసింహరెడ్డి భారీ బడ్జెట్ తో నేషనల్ రేంజ్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తుండగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తొలి సారి చిరు మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి సైరా చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర చేయనున్నాడట. బ్రిటీష్‌ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా విజయ్ కనిపిస్తాడని సమాచారం. కొద్ది కాలం బ్రిటీష్‌ వారి కొమ్ము కాసిన విజయ్ సేతుపతి పాత్ర , ఉయ్యాలవాడ తపనని చూసి పూర్తిగా మారిపోయి, ఆయనతో చేతులు కలిపి బ్రిటీష్‌ వారిపై దండయాత్ర చేస్తాడట. చివరకి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడ‌ని టాక్. మరి ఇంత పవర్ ఫుల్ పాత్ర తనకి దక్కినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాడట విజయ్ సేతుపతి. ఇటీవల విక్రమ్ వేద చిత్రంతో మంచి హిట్ కొట్టిన ఈ తమిళ హీరో సైరా చిత్రంతో తన రేంజ్ ని మరింత పెంచుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.

1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS