సైరాలో విజ‌య్ సేతుప‌తి పాత్ర ఏంటో తెలుసా ?

Tue,December 26, 2017 12:34 PM
Vijay Sethupathi crucial role in syeraa

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా..నరసింహరెడ్డి భారీ బడ్జెట్ తో నేషనల్ రేంజ్ లో తెరకెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. సౌత్, నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్స్ ఈ ప్రాజెక్ట్ లో నటిస్తుండగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తొలిసారి చిరు మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విజయ్ సేతుపతి సైరా చిత్రంలో పవర్ ఫుల్ పాత్ర చేయనున్నాడట. బ్రిటీష్‌ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా విజయ్ కనిపిస్తాడని, కొద్ది కాలం బ్రిటీష్‌ వారి కొమ్ము కాసిన విజయ్ సేతుపతి పాత్ర .. ఉయ్యాలవాడ తపనని చూసి పూర్తిగా మారిపోయి, ఆయనతో చేతులు కలిపి బ్రిటీష్‌ వారిపై దండయాత్ర చేస్తాడట. చివరకి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడ‌ని అప్ప‌ట్లో వార్తలు వ‌చ్చాయి. కాని తాజా స‌మాచారం ప్ర‌కారం ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డికి స‌న్నిహితంగా ఉండే ఒబ‌య్య అనే పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించ‌నున్నాడ‌ని టాక్‌. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ రానుంది. రీసెంట్‌గా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సైరా, సంక్రాంతి నుండి రెండో షెడ్యూల్ జ‌రుపుకోనుంది. ఈషెడ్యూల్‌లో న‌య‌న‌తారతో పాటు మ‌రి కొంద‌రు న‌టులు కూడా జాయిన్ కానున్న‌ట్టు టాక్‌.

1727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS