ట్రాన్స్‌జెండ‌ర్‌గా న‌టిస్తున్న‌ స్టార్ హీరో..!

Wed,September 13, 2017 02:44 PM
Vijay Sethupathi as a transgender in Super Deluxe

విజ‌య్ సేతుప‌తి.. ఈ పేరు ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా సుప‌రిచితం అయి ఉంటుంది. మెగాస్టార్ 151వ చిత్రం సైరాతో విజ‌య్ సేతుప‌తి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో బ్రిటీష్‌ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా విజయ్ కనిపిస్తాడని సమాచారం. కొద్ది కాలం బ్రిటీష్‌ వారి కొమ్ము కాసిన విజయ్ సేతుపతి పాత్ర , ఉయ్యాలవాడ తపనని చూసి పూర్తిగా మారిపోయి, ఆయనతో చేతులు కలిపి బ్రిటీష్‌ వారిపై దండయాత్ర చేస్తాడట. చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడ‌ని టాక్. క‌ట్ చేస్తే విజ‌య్ సేతుప‌తి త‌మిళంలో ప‌లు చిత్రాల‌లో వెరైటీ ప్ర‌యోగాలు చేశాడు. తాజాగా సూప‌ర్ డీల‌క్స్ అనే మూవీ కోసం లేడీ గెట‌ప్ వేశాడు. రెడ్ కలర్ శారీలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా క‌నిపిస్తున్న విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఈ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా , ఫ‌దా ఫాజిల్‌, గాయ‌త్రి కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఏదేమైన ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ హీరో ఇలాంటి కొత్త ప్రయత్నం చేయడం అభిమానుల‌లో చాలా ఆసక్తి కలిగిస్తోంది.


1706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS