స్టూడెంట్‌గా హీరో.. క్రికెట‌ర్‌గా హీరోయిన్

Thu,August 9, 2018 11:08 AM
vijay plays new role in dear comrade

యంగ్ అండ్ డైన‌మైట్ విజ‌య్ దేవ‌ర‌కొండకి అర్జున్ రెడ్డి చిత్రం ఇచ్చిన జోష్‌తో వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన న‌టించిన టాక్సీవాలా చిత్రం విడుద‌ల‌కి సిద్ధం కాగా, ప్ర‌స్తుతం బైలింగ్యువ‌ల్ మూవీ నోటా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాం ద‌ర్శ‌క‌త్వంలో గీతా గోవిందం సినిమా చేసాడు. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడట . ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ప్ర‌స్తుతం భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్‌ పై విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. కాకినాడ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ చేస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని 'తొండంగి'లో షూటింగ్ జరుగుతోంది. ముఖ్య పాత్ర‌ల‌కి సంబంధించి చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. విజ‌య్ న‌టించిన అన్ని చిత్రాల‌లో తెలంగాణ యాస‌లో మాట్లాడి అలరించిన విజ‌య్ దేవ‌ర‌కొండ గోదావ‌రి యాస‌లో మాట్లాడి ఎంత‌గా అల‌రిస్తాడో చూడాలి.

2714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS