ఫుట్ బాల్ కోచ్‌గా స్టార్ హీరో..!

Sun,January 20, 2019 08:32 AM

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ.. ఇల‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తెరి, మెర్స‌ల్ చిత్రాలు మంచి విజ‌యం సాధించాయి. విజ‌య్ 63వ చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రం నేడు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోనున్న‌ట్టు తెలుస్తుంది. రేప‌టి నుండి షూటింగ్ ప్రారంభం కానుంద‌ని అంటున్నారు. క‌తిర్‌, యోగి బాబు, వివేక్ ముఖ్య పాత్ర‌ల‌లో కనిపించ‌నున్న సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌నుంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మకూరుస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. దీపావళి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా రూపొంద‌నుంద‌ని, ఇందులో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని కోలీవుడ్ టాక్‌. మ‌రి కోచ్‌గా విజ‌య్ త‌న అభిమానుల‌ని ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి మ‌రి. విజ‌య్ న‌టించిన చివ‌రి చిత్రం స‌ర్కార్ ప‌లు వివాదాల మ‌ధ్య విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

1912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles