ఉత్త‌మ ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డు జాబితాలో స్టార్ హీరో

Sat,September 22, 2018 12:58 PM
Vijay Nominated For A Prestigious International Award

త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌తో స‌మానంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో విజ‌య్. ఆయ‌న చివ‌రి చిత్రం మెర్స‌ల్‌. వివాదాస్ప‌ద చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్పుడు అనేక అవార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకుంటుంది. గ‌త ఏడాది ఇలయదళపతి విజయ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం అట్లీ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో అదిరింది అనే టైటిల్‌తో విడుద‌లై ఇక్క‌డ కూడా మంచి విజ‌యం అందుకుంది. జీఎస్టీకి సంబంధించి అభ్యంత‌ర డైలాగ్స్‌ తో పాటు వైద్యులకి సంబంధించి కొన్ని వివాదాస్పద డైలాగుల వ‌ల‌న ఈ మూవీ చుట్టూ అప్ప‌ట్లో ప‌లు వివాదాలు చుట్టు ముట్టాయి. అయితే వివాదాస్పద డైలాగ్స్ తొలగించి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారేమోనని అందరు భావించినప్పటికి, ఏ ఒక్క క‌ట్ లేకుండా సెన్సార్ స‌భ్యులు ఈ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

విజయేంద్ర ప్రసాద్ మెర్స‌ల్‌ చిత్రానికి కథ అందించగా ఇందులో సత్య రాజ్ , ఎస్ జె సూర్య సపోర్టింగ్ రోల్స్ పోషించారు. సమంత, కాజల్, నిత్యామీనన్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. మెర్స‌ల్ చిత్రం ఆ మ‌ధ్య అరుదైన ఘనత సాధించింది. యూకే నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు చిత్రాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే అవార్డు అందించింది. ఇక రీసెంట్‌గా దుబాయ్‌లో జ‌రిగిన సైమా ఏడ‌వ ఎడిష‌న్‌లో మెర్స‌ల్ చిత్రం ఐదు అవార్డుల‌ని ద‌క్కించుకుంది. ఇక తాజాగా మెర్స‌ల్ చిత్రానికి గాను విజ‌య్ రెండు విభాగాల‌లో నామినేట్ అయ్యాడు. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎచీవ్‌మెంట్ రిక‌జ్నీష‌న్ అవార్డ్స్ (ఐరా)లో భాగంగా తాజాగా ప‌లు చిత్రాల‌కి సంబంధించిన నామినేష‌న్స్ లండ‌న్‌లోని హిల్ట‌న్ హోట‌ల్‌లో ప్ర‌క‌టించారు. ఉత్త‌మ హీరో, ఉత్త‌మ ఇంట‌ర్నేష‌న‌ల్ హీరో విభాగాల‌లో విజ‌య్‌కి చోటు ద‌క్క‌డంపై ఆయ‌న అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

2396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles