ఆరు నెల‌లుగా షూటింగ్‌తో బిజీ.. కాస్త బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరో

Sun,September 22, 2019 07:09 AM

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్నాడు. ఆయ‌న ఇటీవ‌ల త‌న 63వ సినిమాగా బిగిల్ అనే సినిమా చేశాడు. అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషించాడు. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందించారు . సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం. ఈ సినిమా కోసం దాదాపు ఆరు నెల‌లుగా షూటింగ్‌తోనే బిజీగా ఉన్నాడు విజ‌య్‌. దీంతో కొద్ది రోజులు బ్రేక్ తీసుకొని ఫ్యామిలీతో వెకేష‌న్‌కి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. వ‌చ్చాడు త‌న 64వ ప్రాజెక్ట్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు విజ‌య్‌. లోకేష్ కంగ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 64వ సినిమా చేయ‌నుండ‌గా,ఈ చిత్రాన్ని ఎక్స్‌బీ ఫిలిం క్రియేట‌ర్స్ నిర్మించ‌నున్నారు. అనిరుథ్ ర‌విచంద్ర‌న్ స్వ‌ర‌కర్త‌. 2020 స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు

1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles