రాజ‌కీయాల‌లోకి మ‌రో స్టార్ హీరో..!

Wed,February 7, 2018 05:17 PM
vijay intrested to show in politics

కొన్ని త‌రాల క్రితం సినీసెల‌బ్రిటీస్‌ని బేస్ చేసుకొనే రాజ‌కీయాలు న‌డిచాయి. తెలుగు రాష్ట్రానికి నంద‌మూరి తార‌క రామారావు ముఖ్య మంత్రి కాగా, త‌మిళ నాడు రాజ‌కీయాల‌ని ఎంజీ రామ చంద్రన్, జ‌య‌ల‌లిత‌లు న‌డిపించారు. ఇప్పుడు ఈ త‌రంలోను సినీ సెల‌బ్రిటీల హ‌డావిడి చూస్తుంటే వీరు రాజ‌కీయాల‌లో కొత్త ఒర‌వడిని సృష్టించ‌నున్నారా అనే అభిప్రాయం జ‌నాల‌లో క‌లుగుతుంది. పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పటికే జ‌న‌సేన పార్టీని స్థాపించి రాజ‌కీయాల‌కి త‌న అవ‌స‌రం త‌ప్పక ఉంద‌నే అభిప్రాయాన్ని జ‌నాల‌లో క‌లిగిస్తున్నాడు. ఇక త‌మిళ రాష్ట్రాల‌లో రజ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌లు త్వర‌లోనే పార్టీని స్థాపించి త‌మిళ రాజ‌కీయాల‌ని పూర్తిగా మార్చాల‌ని భావిస్తున్నారు. ఇక‌ ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేయడం ద్వారా యువనటుడు విశాల్‌ కూడా రాజకీయాల్లోకి వచ్చేశాడు. మ‌రో వైపు క‌న్నడ న‌టుడు ఉపేంద్ర ఇటీవ‌ల‌ క‌ర్ణాటక ప్రజ్ఞావంత జనతాపక్ష పార్టీ అని ఎనౌన్స్ చేసి పార్టీ లోగోని ఆవిష్కరించాడు పేదలకి సేవ చేయడం కోసమే తను పార్టీ స్థాపించానని చెబుతూ ప్రజల కోసం తన పార్టీ ఓ వేదికగా మారిందని, తన లక్ష్యాలతో ఏకీభవించే ఎవరైన పార్టీలో చేరవచ్చని తెలిపాడు.

రాజ‌కీయాల‌లో మార్పు కోసం పాలిటిక్స్ లోకి వ‌స్తున్నామ‌ని ప‌లువురు న‌టులు చెప్పుకొస్తున్నారు. త్వర‌లోనే రాజ‌కీయ పార్టీ ప్రక‌టించ‌నున్న రజ‌నీకాంత్ తన పార్టీ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజక వర్గాల్లోనూ పోటీ చేస్తుందని ప్రక‌టించాడు. ఈ నెల 21న పార్టీ పేరు, జెండా, అజెండానూ వెల్లడించి భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి వెళ్లేందుకు కమలహాసన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక ఎప్పటి నుండో రాజ‌కీయాల‌లోకి ఎంట్రీ ఖాయ‌మ‌ని వినిపిస్తున్న పేరు ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్. అప్పట్లో విజ‌య్ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ తన కొడుకు రాజకీయాల్లో వస్తారని చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారు. అయితే ప్రస్తుత ప‌రిస్థితుల్లో రజనీ, కమల్‌ అభిమానులు ఎవరి పరిధిలో వారు ప్రజలను తమ పార్టీ సభ్యులుగా చేర్చుకునే పనిలో మునిగిపోయారు. ఈ సెగ విజయ్‌ అభిమానులకి తగిలింది. దీంతో విజయ్ అభిమానులు కూడా తమ హీరో పేరిట 'విజయ్‌ ప్రజా సంఘం' పేరుతో నూతన వెబ్‌ సైట్‌ ను ప్రారంభించి తద్వారా ప్రజలను సభ్యులుగా చేర్చే పనికి శ్రీకారం చుట్టారు. తమ హీరోకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఎప్పుడైనా రాజకీయరంగ ప్రవేశం గురించి వెల్లడించే అవకాశం ఉండడంతో తాము సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అభిమానులు చెబుతున్నారు. దీంతో 2019 ఎల‌క్షన్స్ మొత్తం సినీ సెల‌బ్రిటీ రాజకీయాలుగా మార‌నున్నాయా అనే అనుమానం జ‌నాల‌లో క‌లుగుతుంది.

4455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles