అభిమానుల తోపులాట‌.. గాయ‌ప‌డ్డ స్టార్ హీరో

Sun,September 16, 2018 10:03 AM
vijay injured in marriage

త‌మిళ‌నాట సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌తో స‌మానంగా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్. ఆయ‌న సినిమాల కోసం అభిమానులు క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తుంటారు. ప్ర‌స్తుతం మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 62వ చిత్రంగా స‌ర్కార్ అనే సినిమా చేస్తున్నాడు విజ‌య్‌. ఈ సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే విజ‌య్ రీసెంట్‌గా అఖిల భార‌త అభిమాన సంఘం అధ్య‌క్షుడు , పాండిచ్చేరి మాజీ శాసన సభ్యుడు ఆనంద్‌ కూతురు వివాహంకి హాజ‌రయ్యారు. పాండిచ్చేరిలో ఈ వివాహ వేడుక జ‌ర‌గ‌గా విజ‌య్ వస్తున్నార‌నే విష‌యాన్ని ముందుగానే తెలియ‌జేసిన ఆనంద్ భారీ క‌టౌట్స్ తో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. శుక్ర‌వారం సాయంత్రం విజ‌య్ త‌న స‌తీమ‌ణి సంగీత‌తో క‌లిసి పాండిచ్చేరి చేరుకొని వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు. విజ‌య్ వ‌చ్చాడ‌నే విష‌యాన్ని తెలుసుకున్న అభిమానులు ఆయ‌న‌ని చుట్టు ముట్టారు. బౌన్స‌ర్స్ కూడా వారిని నియంత్రించ‌లేక‌పోయారు. అభిమానుల తోపులాటతో ఆయన కిందపడబోయారు. కాలికి దెబ్బ కూడా తగి లింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అభిమానులపై లాఠిచార్జ్‌ చేసి విజయ్‌ సంగీత దంపతులను సురక్షితంగా అక్కడి నుంచి పంపించేశారు.


3014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles