అభిమాని పాట‌కి ఫిదా అయిన హీరో, హీరోయిన్

Sat,August 4, 2018 12:21 PM
vijay impressed with shiva shankar song

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం గీత గోవిందం. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన పాట‌ల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తున్నారు మేక‌ర్స్‌. ఇటీవ‌ల శ్రీమణి లిరిక్స్ అందించిన ‘వాట్‌ ద ఎఫ్‌’ అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఈ పాట‌తో ఫ్రస్టేటెడ్ సింగర్ గా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అయితే పాట‌లో అమ్మాయిల గురించి విశ్లేషించ‌డం, పురాణాల ప్ర‌స్తావ‌న తెస్తూ కొంద‌రిలో నెగెటివ్ అభిప్రాయాన్ని క‌లిగించ‌డంపై కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాట ట్యూన్ వినడానికి క్యాచీగానే ఉన్నా.. దాంట్లో రాతలే బాలేవు అంటూ నెటిజన్స్ త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. అంతేకాదు విజ‌య్ స‌రిగా పాడ‌లేదని కూడా అన్నారు. దీంతో మ‌నోడు ఆడియో వేడుక‌లో స్టేజ్‌పైన షాకింగ్ ఎనౌన్స్‌మెంట్ చేశాడు.

మీలో ఎవ‌రైన వాట్ ది ఎఫ్ అనే సాంగ్‌ని పాడి మాకు పంపిస్తే అందులో నచ్చిన స్వరంతో అదే పాటను సినిమా కోసం పాడిస్తామని అన్నారు విజయ్‌. దీంతో అంద‌రు త‌మ‌కి న‌చ్చిన స్టైల్‌లో వాట్‌ ద లైఫ్ అనే పాట పాడి WhatTheLife అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా శివ శంక‌ర్ అనే వ్య‌క్తి పాడిన పాట విజ‌య్‌ని ఆక‌ట్టుకుంది. దీంతో ఆ వీడియోని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఐ ల‌వ్ యూ మ్యాన్ అనే కామెంట్ పెట్టాడు. ఇక ఇదే పాట‌ని లేడి వ‌ర్షెన్‌లో ఓ యువ‌తి పాడ‌గా దానికి ఓ మై గాడ్ అనే కామెంట్ పెట్టి త‌న పేజ్‌లో షేర్ చేసింది ర‌ష్మిక . ప్రొడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో శ్రీ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో రూపొందిన గీత గోవిందం చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు
4359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles