ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుతో విజ‌య్‌కి స‌త్కారం

Wed,December 12, 2018 12:27 PM
vijay Honoured With An International Award

త‌మిళంలో ర‌జ‌నీకాంత్‌తో స‌మానంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న హీరో విజ‌య్. ఆయ‌న న‌టించిన‌ మెర్స‌ల్ చిత్రం వివాదాస్ప‌ద చిత్రంగా తెర‌కెక్కి అనేక అవార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. యూకే నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు వేడుకల్లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో మెర్సల్‌కు అవార్డు దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు కోసం ఏడు చిత్రాలు పోటీ పడగా.. జ్యూరీ మెర్సల్‌కే అవార్డు అందించింది. దుబాయ్‌లో జ‌రిగిన సైమా ఏడ‌వ ఎడిష‌న్‌లో మెర్స‌ల్ చిత్రం ఐదు అవార్డుల‌ని ద‌క్కించుకుంది. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ ఎచీవ్‌మెంట్ రిక‌జ్నీష‌న్ అవార్డ్స్ (ఐరా)లో భాగంగా ఉత్త‌మ హీరో, ఉత్త‌మ ఇంట‌ర్నేష‌న‌ల్ హీరో విభాగాల‌లో ఎంపికైన‌ విజ‌య్ తాజాగా ఆ అవార్డు అందుకున్నాడు. యూకేలో త‌న ఫ్యామిలీతో క‌లిసి విజ‌య్ ఆ అవార్డు అందుకోవ‌డం విశేషం. విజ‌య్ న‌టించిన స‌ర్కార్ ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం విజ‌య్ .. అట్లీ సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది.

2562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles