నేను ఆ ప‌ని చేయ‌డం లేదు,మీరు చేయోద్దు -విజ‌య్

Wed,October 3, 2018 11:20 AM
Vijay Devarkonda gives a message to his fans

యూత్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన తాజా చిత్రం నోటా అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విజ‌య్ పొలిటిక‌ల్ లీడ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఇటీవ‌ల ఈ చిత్రంతో పాటు ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న రౌడీస్‌కి సోష‌ల్ మీడియా ద్వారా సందేశాన్ని అందించాడు విజ‌య్. సినిమా, జీవితం, రౌడీ క‌ల్చ‌ర్‌, యాటిట్యూడ్‌ల‌తో మ‌నలా మ‌నం ఉండేందుకు సోష‌ల్ మీడియాలో మ‌నం ఓ కొత్త మార్పు తీసుకురావాలి అని అన్నారు.

మీలో చాలా మంది ప్రొఫైల్ పిక్‌గా నా ఫోటోని పెట్టుకుంటున్నారు. దీని వ‌ల‌న కొంద‌రు వాద‌నకి దిగుతున్నారు. అలాంటి వారిని నేను ప‌ట్టించుకోను. మీరు కూడా ప‌ట్టించుకోవ‌ద్దు. ఇది కాస్త క‌ష్టంగానే ఉండొచ్చు. నేను సాధించిన విజ‌యాలు నా స్వ‌శ‌క్తితో వ‌చ్చిన‌వి. అందుకే ఇత‌రుల గురించి ప‌ట్టించుకోను. మిమ్మ‌ల్ని ద్వేషించే వారు కూడా ఆనందంగా ఉండాల‌ని కోరుకోండి. మీరు ఎలాంటి దిగులు చెందొద్దు. మంచి సినిమాలు, మంచి దుస్తుల‌తో మ‌రిన్ని మీకు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తాను. ఆన్‌లైన్ వివాదాలు నాకు చూడ‌టం ఇష్టం లేదు అంటూ విజ‌య్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానులకి సందేశం ఇచ్చాడు. ప్ర‌స్తుతం విజ‌య్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. విజ‌య్ డియ‌ర్ కామ్రేడ్‌, టాక్సీవాలా అనే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.


3539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles