విజ‌య్ దేవ‌ర‌కొండ'గీతగోవిందం' టీజర్ విడుదల

Mon,July 23, 2018 01:37 PM
Vijay Devarakondas Geetha Govindam Teaser

హైదరాబాద్: రెండే రెండు సినిమాలు ‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి’ టాలీవుడ్‌లో స్టార్ హోదా తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్, రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన‌ట్లు విజ‌య్ ట్విట‌ర్‌లో పేర్కొన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. ఇటీవల విడుదల చేసిన మొదటిసాంగ్‌కు మంచి ఆదరణ లభించింది.

ఆగస్టు 15న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకే చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్‌లోనే విజయ్ మైమరిపించే నటన, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. విజయ్ తన తరువాతి చిత్రంలో రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో 'టాక్సీవాలా' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు.

1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS