మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్న అర్జున్ రెడ్డి

Wed,June 20, 2018 04:03 PM
Vijay Devarakonda with prashanth in film fare

స్టార్ హీరోలుగా ఉన్నత స్థాయిలో ఉన్నామంటే అందుకు కారణం అభిమానులే అని పలువురు హీరోలు బహిర్గతంగా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అభిమానులే దేవుళ్ళుగా భావిస్తున్న హీరోలు వారి మనసు గెలుచుకునేందుకు కొత్త పద్దతులు అనుసరిస్తున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంతో భారీ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన బర్త్ డే సందర్భంగా మండు వేసవిలో ఐస్ క్రీమ్ లు పంచిపెట్టి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఇక రీసెంట్ గా జరిగిన ఫిలిం ఫేర్ అవార్డు వేడుక కోసం మరో వినూత్న ప్రయత్నం చేపట్టి అభినందనలు పొందుతున్నాడు.

సంఘంలో హీరోగా తాను ఎలాంటి అనుభూతి పొందుతున్నాడో, తన అభిమానులకి కూడా ఆ ఫీలింగ్ ఇవ్వాలనే తలంపుతో ఈ మధ్య రౌడీ క్లబ్ అనే వైబ్ సైట్ ఓపెన్ చేసి అందులో ఫ్యాన్స్ ని రిజిస్టర్ చేసుకోమని అన్నాడు విజయ్ దేవరకొండ. ఇంకేముంది అభిమానులు వరుసగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు.ఈ క్రమంలో సంగారెడ్డి జహీరాబాద్ కి చెందిన ప్రశాంత్ అనే ఎంబిఏ కుర్రాడిని సెలెక్ట్ చేసి తనతో పాటు ఫిలింఫేర్ ఫంక్షన్ కి తీసుకెళ్ళాడు. తను వేసుకున్న కాస్ట్యూమ్స్ లాంటివే ప్రశాంత్ కి కుట్టించి అతనికి మేకప్ చేయించి ఈవెంట్ కి తీసుకెళ్లాడు.

ఫిలిం ఫేర్ అవార్డు వేడుకలోను ఆ వ్యక్తిని తన పక్కనే కూర్చోబెట్టుకొని అందరికి షాక్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. మొత్తానికి ఆ వ్యక్తికి మాత్రం జీవితంలో మరచిపోలేని అనుభూతిని మిగిల్చాడు. తాజాగా తన ట్విట్టర్ లో ఇందుకు సంబంధించి ఓ వీడియో షేర్ చేశాడు. కొత్తదనంతో ముందుకు వెళుతున్న విజయ్ దేవరకొండకి రాను రాను ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది . అర్జున్ రెడ్డి తర్వాత అతను చేసిన ట్యాక్సీ వాలా వచ్చే నెల విడుదల కానుండగా దీనిపై అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది.2794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles