సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్న బుడ‌త‌డి వీడియో

Tue,January 22, 2019 01:14 PM
vijay Devarakonda video goes on viral

అర్జున్ రెడ్డి చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. తెలంగాణ యాసతో తెలుగు రాష్ట్రాల ప్రజల ఆద‌ర‌ణ‌ని ఎంత‌గానో గెలుచుకున్నాడు ఈ యూత్ స్టార్. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన గీతా గోవిందం, టాక్సీవాలా చిత్రాలు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న‌ డియ‌ర్ కామ్రేడ్ విడుద‌లకి సిద్ధంగా ఉంది. అయితే ప్ర‌తి సినిమాకి తన పాపులారిటీ పెంచుకుంటున్న విజ‌య్ అభిమాన గ‌ణాన్ని కూడా భారీగా పెంచుకుంటూ వెళుతున్నాడు. ఈ క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్న‌నాటి సంగ‌తులని వెతికి మ‌రీ సోష‌ల్ మరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు నెటిజ‌న్స్‌. ఆ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ చిన్న‌ప్ప‌టి ఫోటో ఒక‌టి వైర‌ల్ కాగా, తాజాగా వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. 1999లో ఓ టీవీ సీరియల్‌లో షావుకారు జానకితో కలిసి విజయ్‌ నటించిన వీడియోను ఓ అభిమాని విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేశాడు. దీనికి స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌..నా చిన్న‌ప్ప‌టి విష‌యాలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఈ వీడియోని క‌నుగొని నన్ను, నా మామ్‌, ఇత‌రుల‌ని ఆనందింపజేసిన‌వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.


3629
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles