మ‌రో సినిమాకి సైన్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Wed,September 5, 2018 11:43 AM
Vijay Devarakonda SIGNS ANOTHER PROJECT

యంగ్ అండ్ డైన‌మైట్ విజ‌య్ దేవ‌ర‌కొండకి అర్జున్ రెడ్డి చిత్రం ఇచ్చిన జోష్‌తో వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాం ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టించిన గీతా గోవిందం చిత్రం భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టించిన‌ టాక్సీవాలా చిత్రం విడుద‌ల‌కి సిద్ధం కాగా, ప్ర‌స్తుతం బైలింగ్యువ‌ల్ మూవీ నోటా చేస్తున్నాడు. భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ పై డియ‌ర్ కామ్రేడ్ అనే చిత్రంతోను బిజీగా ఉన్నాడు విజ‌య్‌. ఇక ఎవడే సుబ్రమణ్యం సినిమా నిర్మించిన స్వప్నా సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మాతగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేయ‌నున్నాడట‌ . ఇక అదే కాకుండా రాజు డికె డైరక్షన్ లో కూడా ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరో అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ ఉత్సుక‌త చూపుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం మారుతి త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండతో సినిమా చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ఇటీవ‌ల విజ‌య్‌ని క‌లిసి స్క్రిప్ట్ వివ‌రించాడు మారుతి. అది ఎంత‌గానో న‌చ్చిన విజ‌య్ వెంట‌నే మూవీ చేద్దామ‌ని అన్నాడ‌ట‌. యూవీ క్రియేష‌న్స్‌లో ఈ మూవీ రానుందని తెలుస్తుంది. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంతో బిజీగా ఉన్న మారుతి త‌న త‌దుప‌రి చిత్రాన్ని 2019లో మొద‌లు పెట్ట‌నున్నాడు. ఈ సినిమా కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న‌ట్టు స‌మాచారం.

3551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles