ఫ్రాన్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Mon,June 3, 2019 10:36 AM
vijay devarakonda shooting at france

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రం జూలై 26న నాలుగు భాష‌ల‌లో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మ‌రో వైపు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న‌ హీరో అనే బైలింగ్యువ‌ల్ చిత్రం ఇటీవ‌ల లాంచ్ అయింది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలోను ఓ చిత్రం చేస్తున్నాడు విజ‌య్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి కె.ఏ వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి, కేథ‌రిన్ థెస్రా కథానాయికలుగా నటిస్తున్నారు. న‌వ్య‌పంథాలో సాగ‌నున్న ఈ చిత్రానికి బ్రేక‌ప్ అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. వివిధ కోణాల్లో తాను కలుసుకున్న అమ్మాయిలను ప్రేమించి ఆ తరువాత బ్రేకప్ బాదితుడిగా మిగిలిపోతాడట విజ‌య్. డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ డోస్ ఎక్కువ‌గానే ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ఫ్రాన్స్‌లో జ‌రుగుతుంది. విజ‌య్‌తో పాటు క‌థానాయిక‌లు అంద‌రు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

2459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles