ప్రజలారా.. నా మార్పు గురించి ఇంతగా వేచి చూస్తున్నారా?

Tue,July 24, 2018 03:07 PM
vijay Devarakonda   responds about Geetha Govindam Teaser

హైదరాబాద్: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'గీతగోవిందం'. ఈ చిత్రం టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన 9 గంట‌ల్లోపే 20ల‌క్ష‌ల‌కు పైగా ప్రేక్ష‌కులు వీక్షించ‌డం విశేషం. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సినీ అభిమానుల నుంచి అనూహ్యంగా ఆదరణ లభించడంపై హీరో విజయ్ సోషల్ మీడియాలో స్పందించారు.

ప్రజలారా.. నా మార్పు గురించి ఇంతగా వెయిట్ చేస్తున్నారా! హే.. భగవాన్! అని విజయ్ తన ట్విటర్ అకౌంట్‌లో పేర్కొన్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్ని వాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

ఎన్నేన్నో జన్మల బంధం నీదీ నాదీ అంటూ నాయకానాయికలు బ్లాక్ అండ్ వైట్‌లో కలలు కంటున్న దృశ్యంతో మొదలైన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నది. ఇంకొక్కసారి అమ్మాయిలు, ఆంటీలు..ఫిగర్లు అంటూ తిరిగావంటే యాసిడ్ పోస్తా అని గీత.. గోవింద్‌ను హెచ్చరించడం ఆసక్తిగా అనిపిస్తున్నది.



2917
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles