తొలి ప్రేమ ద‌ర్శ‌కుడితో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..!

Tue,January 22, 2019 12:00 PM
vijay devarakonda next project with  venky atluri

వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన చిత్రం తొలి ప్రేమ‌. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఇటీవ‌ల అఖిల్ ప్ర‌ధాన పాత్ర‌లో మ‌జ్ను అనే చిత్రం తెర‌కెక్కించాడు. ఈ చిత్రం జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుంది. ఈ సినిమా కూడా వెంకీకి మంచి హిట్ ఇస్తుంద‌ని అంటున్నారు. ఇక మూడో చిత్రంగా అర్జున్ రెడ్డి చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఈ మూవీ త‌ర్వాత వెంకీ అట్లూరితో క‌లిసి వినూత్న క‌థా చిత్రాన్ని చేస్తాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

1890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles