స్టార్ హీరోల‌ని వెన‌క్కి నెట్టేసిన అర్జున్ రెడ్డి హీరో

Tue,March 13, 2018 01:14 PM
Vijay Devarakonda most desirable man

అర్జున్ రెడ్డి చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌నే కాదు ఆయ‌న చెప్పిన డైలాగులు కూడా ప్రేక్ష‌కుల‌చే ఈలలు వేయించాయి. ఈ సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు తాజాగా టాప్ హీరోలంద‌రిని వెన‌క్కి నెట్టి అంద‌రు నోళ్ళెల్ల‌బెట్టేలా చేశాడు. హైద‌రాబాద్ టైమ్స్ నిర్వ‌హించిన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ 2017 లిస్ట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ టాప్ 2 పొజీష‌న్‌లో ఉన్నాడు. ఆయ‌న త‌ర్వాత టాప్ హీరోస్ ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ , రానా ఎన్టీఆర్ మూడు, నాలుగు,ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల‌లో ఉన్నారు. తొలి స్థానంలో బ‌సీర్ అలీ నిలిచాడు. ఈయ‌న ప‌లు టీవీ రియాలిటీ షోతో పాపుల‌ర్ అయ్యాడు. 2016 సంవ‌త్స‌రంలో మ‌హేష్ బాబు రెండవ స్థానంలో నిల‌వ‌గా, మూడవ స్థానంలో హీరో నాని నిలిచారు. రాణా, జూని య ర్ ఎన్‌టీఆర్ నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. విజ‌య్ దేవ‌ర‌కొండ 22 స్థానంలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఏ మంత్రం వేసావే చిత్రం రీసెంట్‌గా విడుద‌ల కాగా, ప్ర‌స్తుతం టాక్సీవాలా చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘నోటా’ మూవీ చేస్తున్నాడు. కేఈ జ్ఞాన్‌వేల్ రాజా సమర్పణలో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నేపథ్యంలో నోరా సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
4455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles