కాకినాడ బాయ్స్ తో లంచ్ చేసిన రౌడీ

Sat,September 1, 2018 11:17 AM
vijay devarakonda lunch with kakinada fans

వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంటున్న యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇటీవ‌ల గీతా గోవిందం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన రౌడీ ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో విజ‌య్ కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. భరత్ కమ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ పై ఈ మూవీ రూపొందుతుంది. అయితే రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నంతో నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్క‌లు నాటి మిగ‌తా సెల‌బ్రిటీల‌కి ఆ ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ క్ర‌మంలో శ్రీకాంత్ కిదాంబి, బొంతు రామ్మోహ‌న్ యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్‌ని తాజాగా స్వీక‌రించిన విజ‌య్ దేవ‌ర‌కొండ కాకినాడ‌లో త‌న ఫ్యాన్స్‌తో క‌లిసి మొక్క‌లు నాటాడు. అంతేకాదు కాకినాడ బాయ్స్‌తో క‌లిసి లంచ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు విజ‌య్. డియ‌ర్ కామ్రేడ్ ప్ర‌స్తుతం కాకినాడ‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుండగా, చిత్రంలో స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ క‌నిపించ‌నున్నాడు . క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది.


4435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles