సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన విజయ్ దేవరకొండ

Mon,July 16, 2018 07:22 AM
Vijay Devarakonda Filmfare Award Was Auctioned At 25 Lakhs

బంజారాహిల్స్ : సినీ హీరో విజయ్ దేవరకొండ నిజజీవితంలోనూ తాను హీరో అని నిరూపించుకున్నారు. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని జూబ్లీ 800లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా, ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబరేటరీస్ అధినేత కిరణ్ దివి సతీమణి శకుంతల దివి రూ.25 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూ.25 లక్షల చెక్కును విజయ్ దేవరకొండకు అందించగా ఈ మొత్తాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నానని ఆయన ప్రకటించారు.

విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ బాటలో నడుస్తూ ప్రత్యేమైన వస్ర్తాల బ్రాండ్‌ను క్రియేట్ చేస్తూ రౌడీవేర్ పేరుతో క్లాతింగ్ లైన్‌ను ఆవిష్కరించారు. రౌడీవేర్ క్లాతింగ్‌బ్రాండ్‌ను ఆవిష్కరించడంతోపాటు దీనికి సంబందించిన యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ్ స్నేహితులతో కలిసి ఆడిపాడి సందడి చేశారు.

6305
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS