అర్జున్ రెడ్డి త‌ల్లికి ఉమెన్స్ కాలేజ్‌లో విశేష స్పంద‌న‌

Sun,February 18, 2018 01:31 PM
Vijay Devarakonda delt happy with huge response

పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డితో సౌత్ ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించాడు. నెగెటివ్ ప‌బ్లిసిటీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డిగా న‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి లెక్క‌లేన‌న్ని ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇప్పుడు ఈ హీరో సినిమాల‌పై జ‌నాల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం రాహుల్ సంకృతియ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్. టాక్సీవాలా అనే టైటిల్‌తో ఈ మూవీ ప్ర‌చారం జ‌రుపుకుంటుంది. క‌ట్ చేస్తే విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి మాధ‌వి రీసెంట్‌గా రెడ్డి ఉమెన్స్ కాలేజ్‌ని సంద‌ర్శించారు . అక్క‌డ స్టేజ్ పైకి మాధ‌వి రావాల‌ని ఎనౌన్స్ చేయ‌గానే, ఆడిటోరియం మొత్తం అమ్మాయిలు అల్ల‌ర్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. మాధ‌విలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని చూసిన అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వీడియోని విజ‌య్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ.. మ‌మ్మీ , రెడ్డీ ఉమెన్స్ కాలేజీని సంద‌ర్శించింది. నేను న‌టుడిగా మారిన త‌ర్వాత నేను చూసిన గొప్ప సీన్ ఇదే. మీ ప్రేమ‌ని నేను ఫీల‌వుతున్నాను అని కామెంట్ పెట్టాడు.


4175
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS