వెరైటీ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Thu,October 18, 2018 09:57 AM
Vijay Devarakonda appears in new shade

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ని ఎంచుకుంటూ అతి త‌క్కువ టైంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విజ‌య్ రీసెంట్‌గా నోటో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తాజాగా డియ‌ర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక త్వ‌ర‌లో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫెమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేయ‌నున్నాడు. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎస్. రామారావు సమర్పకుడిగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి కె.ఏ వల్లభ నిర్మాత. రాశీఖన్నా, ఐశ్వర్యరాజేష్, బ్రెజిల్ మోడల్ ఇసాబెల్లె డి కథానాయికలుగా నటించనున్నారు.

ఈ సినిమా గురించి ఫిలిం న‌గ‌ర్ సర్కిల్‌లో ఓ ఆస‌క్తికర చ‌ర్చ జ‌రుగుతుంది. వినూత్న ప్రేమ క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పాత్ర వైవిధ్యంగా ఉండ‌నుండ‌గా, ప్రేమ‌లో అతని దృష్టి కోణం విభిన్నంగా సాగుతుంద‌ని అంటున్నారు. ముగ్గురు హీరోయిన్లకి , హీరోకి మ‌ధ్య జ‌రిగే సంఘ‌ట‌న‌లు ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని అందిస్తుంద‌ని చెబుతున్నారు. న‌వ్య‌పంథాలో సాగ‌నున్న అతని పాత్ర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరిస్తుంద‌ట‌. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్ కాగా సంగీతం గోపీసుందర్ అందిస్తున్నారు.

1899
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles