విజ‌య్ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌కి టైం ఫిక్స్‌

Tue,June 19, 2018 11:38 AM

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలో ఏ రేంజ్ క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తుంటారు. ఇటీవ‌ల‌ మెర్స‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విజ‌య్ ఈ చిత్రంతో కాస్త నిరాశ‌ప‌ర‌చాడు. దీంతో అభిమానులు విజ‌య్ తదుప‌రి సినిమాపై చాలా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. స్టార్‌ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 62వ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా పని చేస్తున్నారు.

విజ‌య్ బ‌ర్త్ డే(జూన్ 22) సంద‌ర్భంగా ఆయ‌న 62వ చిత్ర‌ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ని జూన్ 21 సాయంత్రం 6గం.ల‌కి విడుద‌ల చేయ‌నున్నట్టు స‌న్‌టీవి ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే విజ‌య్ బ‌ర్త్‌డేకి సంబంధించి అభిమానులు భారీ ప్లాన్స్ చేసుకున్నారు. కామ‌న్ డీపీ త‌యారు చేసుకున్న ఫ్యాన్స్ విజ‌య్ బ‌ర్త్‌డే రోజున అదే పిక్‌ని ప్రోఫైల్ పిక్‌గా పెట్టుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. అన్న‌దానం, ర‌క్త‌దానాల‌తో పాటు ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కూడా వీరు చేప‌ట్ట‌నున్నార‌ని తెలుస్తుంది. కాని తూత్తుకుడి ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన వారికి సంఘీభావంగా విజ‌య్ ఈ ఏడాది త‌న బ‌ర్త్‌డేని జ‌రుపుకోడ‌ని అన్నారు. విజ‌య్ 62వ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. తుపాకి, క‌త్తి వంటి చిత్రాలు విజ‌య్ - మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించగా, తాజా చిత్రంతో హ్య‌ట్రిక్ కొడ‌తారని అభిమానులు భావిస్తున్నారు.


2148
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles