క్లాప్ కొట్టిన విజ‌య్.. మొద‌లైన షూటింగ్‌

Sat,January 20, 2018 11:26 AM
vijay 62 movie started

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తుంటారు. ఇటీవ‌ల‌ మెర్స‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విజ‌య్ ఈ చిత్రంతో కాస్త నిరాశ‌ప‌ర‌చాడు. దీంతో అభిమానులు విజ‌య్ తదుప‌రి సినిమాపై చాలా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. స్టార్‌ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 62వ సినిమా చేయ‌నున్నాడు. సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఉంటారు. రీసెంట్‌గా ఈ మూవీ చెన్నైలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. విజయ్‌, కీర్తిసురేష్‌, ఏఆర్‌ మురుగదాస్‌తో పాటు చిత్రబృందం ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఈ సందర్భంగా తొలి సన్నివేశానికి విజయ్‌ క్లాప్‌కొట్టారు. డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ఇప్ప‌టికే కంపోజింగ్ మొద‌లు పెట్టేశాడ‌ట‌. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంద‌ని మురుగ‌దాస్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. తుపాకి, క‌త్తి వంటి చిత్రాలు విజ‌య్ - మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించగా, తాజా చిత్రంతో హ్య‌ట్రిక్ కొడ‌తారని అభిమానులు భావిస్తున్నారు.

933
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles