మురుగ‌దాస్ సినిమాలో విజ‌య్ లుక్ ఇదేనా ?

Mon,January 29, 2018 10:41 AM
vijay 62 movie pic goes viral

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి త‌మిళంలో ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. ఆయ‌న సినిమా కోసం అభిమానులు వేయి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తుంటారు. ఇటీవ‌ల‌ మెర్స‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విజ‌య్ ఈ చిత్రంతో కాస్త నిరాశ‌ప‌ర‌చాడు. దీంతో అభిమానులు విజ‌య్ తదుప‌రి సినిమాపై చాలా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. స్టార్‌ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 62వ సినిమా చేయ‌నున్నాడు. సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఉంటారు. రీసెంట్‌గా ఈ మూవీ చెన్నైలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. అయితే ఈ మూవీలో విజ‌య్ లుక్ ఎలా ఉంటుంది అని ఊహాగానాలు చేస్తుండ‌గా, విజ‌య్ లుక్ ఇదే నంటూ ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ పిక్‌లో విజ‌య్ చాలా స్టైలిష్‌గా ఉన్నాడ‌ని అభిమానులు చెప్పుకుంటున్నారు. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది. తుపాకి, క‌త్తి వంటి చిత్రాలు విజ‌య్ - మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి మంచి విజ‌యం సాధించగా, తాజా చిత్రంతో హ్య‌ట్రిక్ కొడ‌తారని అభిమానులు భావిస్తున్నారు.

1772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS