విజ‌య్ అభిమానుల‌కి గుడ్ న్యూస్‌

Thu,January 11, 2018 12:08 PM
vijay 62 movie goes on to the sets from next week

ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇటీవ‌ల మెర్స‌ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ మూవీ అదిరింది అనే టైటిల్‌తో విడుద‌లైంది. రెండు భాష‌ల‌లో ఈ చిత్రానికి మంచి అప్లాజ్ ల‌భించింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో విజయ్ త‌న 62వ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ త‌న 62వ సినిమా చేయ‌నున్నాడు. సన్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నున్న‌
ఈ చిత్రానికి గిరీష్ గంగాధ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌నుండ‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, టీ సంతానం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఉంటారు. వ‌చ్చే వారం నుండి ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానున్నట్టు స‌మాచారం. డ‌బుల్ ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ఇప్ప‌టికే కంపోజింగ్ మొద‌లు పెట్టేశాడ‌ట‌. కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.

1697
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles