ప్రియుడి బ‌ర్త్‌డే వేడుక‌లో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా న‌య‌న‌తార‌

Thu,September 19, 2019 12:04 PM

లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, స్టార్ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. అతి త్వ‌ర‌లో వారిద్ద‌రి వివాహం జ‌ర‌గ‌నుందని అనేక వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి, వీరిద్ద‌రిలో ఏ ఒక్క‌రు స్పందించ‌డం లేదు. అయితే బుధ‌వారం విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్‌డే కావడంతో ఆయ‌న పుట్టిన రోజు వేడుక‌ని ఘ‌నంగా జ‌రిపింది న‌య‌న‌తార. ప‌లువురు సెల‌బ్రిటీలు బ‌ర్త్‌డే వేడుక‌కి హాజ‌రు కాగా, వారంద‌రిలో న‌య‌న‌తార స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. బుధవారం విఘ్నేష్ 34వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నాడు. ఆ ముందు రోజు రాత్రి 12 గంటలకు చెన్నైలోని ఓ కేఫ్‌లో నయన్ గ్రాండ్ పార్టీ ఇచ్చి విఘ్నేష్ చేత కేక్ కట్ చేయించింది. విఘ్నేష్ బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. విఘ్నేష్ శివ‌న్ నెట్రిక‌న్ అనే సినిమాతో తొలిసారి నిర్మాత అవ‌తారం ఎత్త‌గా, ఇందులో న‌య‌న‌తార అంధురాలిగా క‌నిపించ‌నుంది.





2520
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles