పెళ్ళి గురించిన న‌య‌న్‌ని అడిగి చెబుతా: ప్రియుడు

Thu,September 20, 2018 10:19 AM
vignesh Shivan opens on his marriage

న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్‌ల మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వ‌స్తున్నా, దీనిపై పూర్తి క్లారిటీ రావ‌డం లేదు. అప్పుడ‌ప్పుడు టూర్స్‌లో దిగిన ఫోటోస్‌తో త‌మ మ‌ధ్య రిలేష‌న్ న‌డుస్తుంద‌నే హింట్ ఇస్తున్న‌ప్ప‌టికి, ఈ ఇద్ద‌రు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే దానిపై పూర్లి క్లారిటీ లేదు. మీడియా వీరి ప్రేమ పెళ్లి విష‌యం గురించి ఎన్నిసార్లు ప్ర‌స్తావ‌న‌కి తెచ్చిన కూడా వారు క్లారిటీ ఇవ్వ‌డం లేదు. తాజాగా ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివన్ లేడీ సూప‌ర్ స్టార్ నయన్‌తో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నాడు. ఇక ఇటీవ‌ల విఘ్నేష్ శివ‌న్ ఓ ప‌త్రిక‌కి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌గా, ఇందులో భాగంగా న‌య‌న్‌తో పెళ్ళి గురించి అడిగారు. ఇందుకు విఘ్నేష్ .. ‘నాకు తెలియదు. తెలిస్తే మీకు చెబుతా. ముందు నయనతారను, ఆ తర్వాత మా అమ్మను అడిగి చెబుతా’ అంటూ చెప్పుకొచ్చాడు. న‌య‌న‌తార ప్ర‌స్తుతం సైరా చిత్రంతో బిజీగా ఉంది. ప‌లు త‌మిళ సినిమాల‌లోను న‌టిస్తుంది.

2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles