12 ఏళ్ల కేసు..నిర్దోషిగా బయటపడ్డ నటుడు

Mon,June 17, 2019 05:48 PM
Vidyut Jammwal acquitted in 12-year-old assault case

పన్నెండేళ్ల కింద నమోదైన ఓ కేసులో కమాండో ఫేం యాక్టర్ విద్యుత్ జమ్వాల్‌ను బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..2007 ఆగస్టు 31న విద్యుత్ జమ్వాల్ తన స్నేహితులతో కలిసి ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో పార్టీ చేసుకున్నాడు. హోటల్ నుంచి బయటకొస్తుండగా జమ్వాల్ , అతని స్నేహితులు తనపై దాడి చేశారని జుహూకు చెందిన వ్యాపారి రాహుల్ సూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జమ్వాల్ తనపై దాడి చేయడమే కాకుండా..బాటిల్ తో తలపై కొట్టాడని రాహుల్‌సూరి ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఈ కేసు విచారణలో భాగంగా విద్యుత్ జమ్వాల్‌కు కోర్టు నోటీసులు జారీచేసింది. అయితే జమ్వాల్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. చివరగా నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేయగా..తాజాగా కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యాడు విద్యుత్ జమ్వాల్. వ్యాపారిపై దాడికి పాల్పడినట్లు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు జమ్వాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిందని అతని తరపు న్యాయవాది అనికేత్ నికమ్ వెల్లడించారు.

6743
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles