‘ఎన్టీఆర్‌’లో తన పాత్ర గురించి చెప్పిన విద్యాబాలన్

Mon,July 16, 2018 05:31 PM
vidyabalan tells about her role in NTR Movie

క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్‌’ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఎన్టీఆర్‌లో విద్యాబాలన్ కీలకమైన బసవతారకం పాత్రను పోషిస్తుందని టాక్ వినిపిస్తుండగా..మరో వైపు కేవలం ఓ చిన్న పాత్రలో మాత్రమే ఆమె కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చింది విద్యాబాలన్. ఎన్టీఆర్ చిత్రంలో తాను ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నానని..సినిమా షూట్‌లో పాల్గొనేందుకు చాలా ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నానని విద్యాబాలన్ చెప్పింది. ఎన్టీఆర్ చిత్రంలో బీఏ సుబ్బ‌రావు పాత్ర‌ని సీనియ‌ర్ న‌రేష్‌, పింగ‌లి నాగేంద్ర‌రావు పాత్ర‌ని సంజ‌య్ రెడ్డి, నాగిరెడ్డి పాత్ర‌ని ప్ర‌కాశ్ రాజ్ పోషించ‌నున్న‌ట్టు స‌మాచారం.

2326
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles