బోనికి స్పెష‌ల్ నోట్ రాసిన విద్యా బాల‌న్‌

Thu,April 4, 2019 11:58 AM
Vidya Balan wraps up shoot for Boney Kapoor

బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్ పింక్ రీమేక్ చిత్రం నెర్కొండ పార్వాయితో త‌మిళ చిత్ర సీమ‌లోకి అడుగుపెట్టింది. చిత్రాన్ని నిర్మిస్తున్న బోని క‌పూర్‌కి కూడా ఈ మూవీ త‌మిళ డెబ్యూ మూవీ అన్న సంగ‌తి తెలిసిందే. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, అజిత్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించనున్నారు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో అజిత్ కోట్ వేసుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపించారు. బాలీవుడ్ మూవీ పింక్ తొలి పోస్ట‌ర్ మాదిరిగానే ఈ పోస్ట‌ర్ ఉండ‌టం విశేషం.

నెర్కొండ పార్వాయి చిత్రంలో అజిత్ భార్య‌గా విద్యా బాల‌న్ న‌టిస్తుంది. ఈమెకి ఈ చిత్రం త‌మిళంలో తొలి మూవీ కాగా, రీసెంట్‌గా షూటింగ్ పూర్తైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బోనిక‌పూర్‌తో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఆయ‌న‌కి కంగ్రాట్స్ తెలిపింది. స్పెష‌ల్ చిత్రంలో స్మాల్ పార్ట్ అయినందుకు ఆనందంగా ఉంద‌ని విద్యా బాల‌న్ అన్నారు. గిబ్రాన్‌ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. నీరవ్‌షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు . అధిక్‌ రవిచంద్రన్‌, అర్జున్‌ చిదంబరం, అశ్విన్‌ రావు, సుజిత్‌ శంకర్‌ ముఖ్య పాత్ర‌లు పోషించారు.


1056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles