మ‌రో బ‌యోపిక్‌లో న‌టించ‌నున్న విద్యా బాలన్

Thu,May 9, 2019 09:53 AM
Vidya Balan to play Math genius Shakuntala Devi

బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్ మ‌రో బ‌యోపిక్‌లో న‌టించేందుకు సిద్ధమైంది. ఇటీవ‌ల ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన క‌థానాయ‌కుడు చిత్రంలో బ‌స‌వ‌తారకం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసిన విద్యా, ఇప్పుడు, మ్యాథ్స్ జీనియ‌స్ శంకుతల దేవి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ట‌. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. శ‌కుంత‌ల దేవి ఓ హ్యూమ‌న్ కంప్యూట‌ర్. ఐదు సంవ‌త్స‌రాల వ‌యస్సులో 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న విద్యార్ధుల మ్యాథ్స్ ప్రాబ్ల‌మ్స్‌ని సులువుగా సాల్వ్ చేసింది. శ‌కుంత‌ల దేవి పాత్ర‌లో న‌టించ‌డం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ఆమె ఒక బల‌మైన స్త్రీ. శకుంత‌ల గారి ప్ర‌తిభ ప్ర‌పంచానికి తెలియాలన్న‌దే త‌న కోరిక అని విద్యా బాలన్ తెలిపారు. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్టు స‌మాచారం.

1080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles