ఇందిరా గాంధీ బ‌యోపిక్ లేట్ కావ‌డానికి కార‌ణం.. ?

Tue,August 13, 2019 01:44 PM

బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్ బ‌యోపిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న‌ సంగ‌తి తెలిసిందే . ఇటీవ‌ల ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన క‌థానాయ‌కుడు చిత్రంలో బ‌స‌వ‌తారకం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసిన విద్యా, ఇప్పుడు మ్యాథ్స్ జీనియ‌స్ శంకుతల దేవి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది.


క‌ట్ చేస్తే మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ బ‌యోపిక్‌లోను విద్యాబాల‌న్ న‌టిస్తున్న‌ట్టు ఆ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చిన ఇంత వ‌ర‌కు దీనికి సంబంధించి మ‌రో అప్‌డేట్ లేక‌పోవ‌డంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింద‌ని అభిమానులు భావించారు. కాని తాజాగా దీనిపై విద్యా స్పందించింది. ఈ చిత్రం బ‌యోపిక్ కావ‌డంతో చాలా వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. రోనీ స్క్రూవాలా .. ఇందిరా గాంధీకి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని సేక‌రించి ఆడియ‌న్స్‌కి న‌చ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం సాగ‌రిక ఘోష్ రాసిన ఇందిరా : ఇండియాస్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ప్రైమ్ మినిస్ట‌ర్ పుస్తకం ఆధారంగా రూపొందుతుంది. అతి త్వ‌ర‌లోనే మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని విద్యా పేర్కొన్నారు.

2105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles